చిరు స్కెచ్ అదిరిందండోయ్
చిరంజీవి
150వ
సినిమా ఎప్పుడు,
ఎవరితో
అనే సందిగ్థానికి మెగాస్టార్
దాదాపుగా తెరదించేశాడు.రామ్‌చరణ్
సినిమాలో ఓ
అతిథి పాత్రలో తళుక్కున
మెరవడానికి గ్రీన్ సిగ్నల్
ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.
దాంతో 150వ
సినిమా ప్రస్తావన
కొంతకాలం పక్కన పెట్టినట్టైంది.
సంఖ్యా
పరంగా చూస్తే.. చరణ్
సినిమాలో గెస్ట్ రోలే చిరుకి 150వ
సినిమా అవుతుంది.
దాంతో
చిరు 150వ
సినిమాకి ఏ ప్రత్యేకతా
లేకుండా పోయిందన్నది
అభిమానుల ఫీలింగ్.
150వ
సినిమాతో హీరోగా మెరిసి,
సంచలనాలు
సృష్టించి,
తమ
అభిమాన హీరో గ్రాండ్‌గా
రీఎంట్రీ ఇస్తాడనుకొంటే..
ఇలా
చేశాడేంటి అని వాళ్లూ
ఫీలవుతున్నారు.
అయితే
ఈ ఎత్తుగడ వెనుక చిరు
భారీ స్కెచ్ వేశాడు.
అదెలా
అంటే... చిరు
150వ
సినిమాకి భారీ
అంచనాలు ఏర్పడ్డాయి.
అటు పూరి
జగన్నాథ్,
ఇటు
వినాయక్....
ఇద్దరిలో
ఎవరితో ముందడుగు వేసినా
ఎక్స్ పెక్టేషన్స్ భారీ
లెవిల్లో ఉంటాయి.
ఈ
పరిస్థితుల్లో వాటిని
అందుకోవడం కూడా కష్టమే.
దానికి
తోడు చిరుని ఇప్పుడు హీరోగా
ఆదరిస్తారా, చిరు
సినిమాల్లోకి వస్తే పూర్వ
స్థాయిలో ఆదరణ ఉంటుందా,
ఇది
వరకటిలా రికార్డులు
బద్దలవుతాయా,
అనే
అనుమానం ఉంది.
దాన్ని
పరీక్షించుకోవాలనుకొంటున్నాడు
చిరు.
అందుకే
చరణ్‌సినిమాలో `ట్రైలర్`
చూపించబోతున్నాడు. చిరు
రాకతో..
చరణ్
సినిమా మైలేజీ
పెరిగితే,
చిరు
సక్సెస్ అయినట్టే.
చిరుని
వెండి తెరపై చూడాలని
ప్రేక్షకులూ కోరుకొంటున్నట్టే.
అప్పుడు
తన 151వ
సినిమాని గ్రాండ్ లెవిల్లో
చేయొచ్చు.
దానికి
తోడు తాను కెమెరా ముందు ఇది
వరకటిలా కంఫర్ట్‌గా
ఉన్నాడా,
లేదా
అనేది కూడా పరీక్షించుకోవచ్చు.
చరణ్
సినిమాలో చిరుతో ఓ పాట చేయించాలని
చిత్రబృందం భావిస్తోందట.
ఇంకేం...
డాన్సుల
విషయంలోనూ రిహార్సల్స్
దొరికేసినట్టే.
అంటే
చిరు తన తదుపరి సినిమాకి
చరణ్ సినిమాని ఓ ట్రైలర్‌గా
వాడుకొంటున్నాడన్నమాట.
అంతేనా
అంటే ఇంకా ఉంది.
ఈ
5
నిమిషాల
పాత్ర కోసం చిరు
రూ.5
కోట్ల
పారితోషికం డిమాండ్చేసినట్టు
తెలుస్తోంది.
అందుకు
నిర్మాత కూడా సిద్ధంగానే
ఉన్నాడు.
ఎందుకంటే
చిరు వల్ల ఈ సినిమాకి
కనీసం రూ.20
కోట్ల
అదనపు మార్కెట్ జరిగే
అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు
లెక్కలు కడుతున్నాయి.
ఆ
లెక్కన చిరుకి
రూ.5
కోట్లు ఇవ్వడంలోనూ
తప్పులేదు.
అంటే... చిరు
ఒక్క అతిథి పాత్రని ఇన్ని
రకాలుగా ఉపయోగించుకొంటున్నాడన్నమాట.
చిరు
తెలివైనవాడే సుమీ..!
Comments
Post a Comment