ప్ర‌భాస్ 'పెళ్లి కూతురు' ఎవ‌రో తెలిసిపోయిందోచ్‌!

ప్ర‌భాస్ 'పెళ్లి కూతురు' ఎవ‌రో తెలిసిపోయిందోచ్‌!


టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్‌! రెండేళ్ల నుంచీ ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే... బాహుబ‌లి కోసం త‌న పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకొన్నాడు. బాహుబ‌లి పార్ట్ 1 ముగిసిన వెంట‌నే ప్ర‌భాస్‌కి పెళ్లి చేయాల‌ని ఇంట్లోవాళ్లు ఫిక్స‌య్యారు కూడా. ఇటీవ‌లే భీమ‌వ‌రంలో ప్ర‌భాస్‌కి ఓ సంబంధం చూశార‌న్న వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లుకొట్టింది.

ఇదే విష‌యాన్ని ప్ర‌భాస్‌ని అడిగితే.. `అదేం లేదు. నాకేం సంబంధాలు చూడ‌లేదు` అని ప్ర‌భాస్ క్లారిటీ ఇచ్చాడు. కానీ.... భీమ‌వ‌రంలో ప్ర‌భాస్‌కి సంబంధం ఫిక్స‌య్యింద‌న మాట వాస్త‌వ‌మే అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పెళ్లి కూతురు.. భీమ‌వ‌రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంద‌ట‌. 2016లో ప్ర‌భాస్ పెళ్లి చేయాల‌ని ఇంట్లోవాళ్లు నిర్ణ‌యం తీసుకొన్నార‌ట‌.

అయితే బాహుబ‌లి పూర్త‌య్యే వ‌ర‌కూ ఈ విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌డం ఇష్టంలేని ప్ర‌భాస్.. ఆ ర‌హ‌స్యాన్ని త‌న‌లోనే దాచుకొన్నాడ‌ని చెప్తున్నారురాజ‌మౌళి కూడా `బాహుబ‌లి 2` విష‌యంలో ప్ర‌భాస్‌ని తొంద‌ర చేస్తున్న నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా బాహుబ‌లిని పూర్తి చేసి, పెళ్లికిరెడీ అవ్వాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడ‌ట‌.






Comments