ఉల్లి అంటే హరీష్ కు కోపం వచ్చింది
ఉల్లి
పేరు చెబితే సామాన్య
ప్రజలు ఎలా మండిపడుతున్నారో,
అలాగే
తెలంగాణ మంత్రులు కూడా మండిపడుతున్నారు.
ఉల్లిపాయల
ధరలు ఆకాశాన్ని అంటుతున్న
నేపథ్యంలో..
సామాన్యులకు
అందుబాటులో ఉండేలా సబ్సిడీ
మీద తెలంగాణ సర్కారు ఉల్లిపాయల్ని
సరఫరా చేస్తున్న సగంతి
తెలిసిందే.
అయితే
ఇంత చేస్తున్న ఉల్లిపాయల
సరఫరాలో లోపాలు..జనాలు
ఇబ్బందులు పడుతున్నారని
పత్రికల్లో వార్తలు రావటంపై తెలంగాణ
రాష్ట్ర మంత్రి హరీశ్
రావు మండిపడ్డారు.
రూ.40కోట్లు
ఖర్చు చేసి ఉల్లిపాయిల్ని
సబ్సిడీలో ప్రజలకు అందిస్తున్న
కొన్ని పత్రికలు పచ్చి అబద్ధాలు
రాస్తూ ప్రజల్ని తప్పుదారి
పట్టిస్తున్నాయని ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు. కోట్ల
రూపాయిలు ఖర్చు చేసి పనులు
చేస్తున్నా..
విమర్శలు
చేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
చూస్తుంటే
రాసే ప్రతివార్త హరీశ్
రావు అండ్ కోలను పొగిడేయటం
తప్పించి చిన్నపాటి
విమర్శను కూడా భరించలేని
స్థితికి తెలంగాణ సర్కారు
చేరుకున్నట్లు కనిపిస్తోంది.
Comments
Post a Comment