తొలి మెగా 'హీరోయిన్' వస్తోంది!
మెగా
ఇంట్లోంచి హీరోలు చాలామంది
వచ్చారు...
వస్తూనే
ఉన్నారు. చిరంజీవి నుంచి
మొదలైన ఆ ప్రస్థానం, పవన్
కల్యాణ్,
రామ్‌చరణ్, బన్నీ,
వరుణ్‌తేజ్,
సాయిధరమ్
తేజ్,
అల్లు
శిరీష్ -
ఇలా
అప్రహిహాతంగా కొనసాగుతూనే
ఉంది.
అయితే
ఆ ఇంటి నుంచి ఇప్పటి వరకూ
హీరోయిన్ మాత్రం రాలేదు.
ఆలోటు
తీర్చబోంది నీహారిక.
నాగబాబు
తనయ... నిహారిక
ప్రస్తుతం ఈటీవీ నిర్వహిస్తున్న
ఓ రియాలిటీ షోకి యాంకర్‌గా
వ్యవహరిస్తోంది.
నిహారికని
హీరోయిన్‌గా చేయాలన్నది
నాగబాబు కోరిక.
దానికి
తగ్గట్టు..
వెండి
తెరపై అడుగుపెట్టాలని
నిహారిక కూడా గట్టిగా కృషి
చేస్తోందట.
నిన్నా
మొన్నటి వరకూ `సినిమాల్లో
నటిస్తావా నిహారికా`
అని
అడిగితే `
ఆ
ఉద్దేశం లేద`ని
చెప్పిన ఈ అమ్మాయి ఇప్పుడు
సడన్ గా రూటు మార్చింది.
`మా
ఇంట్లో సినిమా వాతావరణమే
ఉంటుంది.
చిన్నప్పటి
నుంచీ ఆ వాతావరణంలోనే
పెరిగా.
నాకూ..
ఆ
గాలి సోకింది`
అంటూ
సమాధానం ఇస్తోంది.
నిహారిక
కోసం కొంతమంది దర్శకులు
ఇప్పుడే ప్రయత్నాలు
మొదలెట్టేశారు. నాగబాబు
కూడా నిహారిక ప్రాజెక్ట్స్‌పై దృష్టి
పెట్టారట.
ఓ
క్రేజీ సినిమాతో నిహారికను
లాంఛ్ చేయాలని నాగబాబు
డిసైడ్ అయ్యారనితెలుస్తోంది.
ఇంకేముంది??
తొలి మెగా
హీరోయిన్‌గా నిహారిక త్వరలోనే
వెండితెరపై చూడడానికి
సమయం ఆసన్నమైందన్నమాట.
Comments
Post a Comment