రాజ‌మౌళి సెటైర్ వేశాడా??

రాజ‌మౌళి సెటైర్ వేశాడా??


50, 100, 150, 200.. ఇలా రోజుల త‌ర‌బ‌డి ఓ సినిమాని ఆడించుకొనే రోజులు పోయాయి. శ‌త‌దినోత్స‌వాల‌కు పుల్‌స్టాప్ ప‌డిపోయింది. ఇప్పుడ‌న్నీ వారం సినిమాలే. తొలి మూడు రోజుల్లో ఓ సినిమా ఎంత వ‌సూలు చేసింద‌నేదానిపైనే ఆ సినిమా జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డిపోయాయి. మ‌హా అయితే సినిమా భ‌విష్య‌త్తు వారంలో డిసైడ్ అయిపోతుంది. ఇలాంటి రోజుల్లో అర్థ శ‌త‌దినోత్స‌వాలు, శ‌త‌దినోత్స‌వాల కోసం ఎదురుచూడొద్ద‌ని రాజ‌మౌళి ట్విట్ చేశాడు.

బాహుబ‌లి వంద రోజులు ఆడే అవ‌కాశం ఉన్నప్ప‌టికీ కొన్ని థియేట‌ర్ల‌లోంచి బాహుబ‌లిని తీసేశారు. దాంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గుర‌య్యారు. వీళ్ల‌ని కూల్ చేయ‌డానికి రాజ‌మౌళి ఇలా ట్వీట్ చేశాడు. అయితే రాజ‌మౌళి ట్విట్ చాలామందికి డైరెక్ట్ గా త‌గిలేసింది. కొంత‌మంది స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు 50, 100 రోజుల రికార్డుల కోసం వెంప‌ర్లాడుతున్నారు. వాళ్లంద‌రిపైరా రాజ‌మౌళి సెటైర్ వేసిన‌ట్టైంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లాడుకొంటున్నారు.

ఈమ‌ధ్య ఓ అగ్ర క‌థానాయ‌కుడి సినిమా రెండు థియేట‌ర్ల‌లో రోజుల త‌ర‌బ‌డి ఆడుతోంది. జ‌క్క‌న్న ట్విట్ ఆ సినిమాపై వేసి సెటైర్‌లాంటిదేన‌ని ఇంకొంద‌రు అంటున్నారు. ఏదేమైనా రాజ‌మౌళి నిజ‌మే చెప్పాడు. రికార్డుల కోసం ఓ సినిమాని ఆడించుకొంటూ పోతే.. ఫ్యాన్స్ జేబులే గుల్ల‌వుతాయి. ఈ నిజాన్ని వీర ఫ్యాన్స్ ఎప్పుడు తెలుసుకొంటారో?





Comments