మంచువారి 'హనుమంతుడి జీవిత కథ'

మంచువారి 'హనుమంతుడి జీవిత కథ'


బాహుబలి ఇచ్చిన స్పూర్తితో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాని నెత్తికెత్తుకోబోతున్నాడు.హనుమంతుడి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందిభారీ బడ్జెట్ కావడంతో భాగస్వామ్యం కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థల్ని కూడా సంప్రదిస్తున్నాడని సమాచారం. సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, ఇంగ్లీష్భాషల్లోనూ రూపొందనుందని తెలుస్తోందితెలుగు తమిళ భాషల వరకు ఓ కన్సల్టెంట్ డైరెక్టర్ ను నియమించుకుంటాడట. హనుమంతుడి బాల్యం నుంచి హిమాలయాలకు వెళ్లేవరకూ జరిగిన విశేషాలను తెరకెక్కించనున్న ఈ సినిమాలో హనుమంతుడిగా మంచు విష్ణు నటించబోతున్నాడట. విష్ణు ప్రయత్నాలు ఫలిస్తే ఈ సినిమా మంచు ఫ్యామిలీ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.





Comments