#RRR: రాజమౌళి ఆడిషన్స్?
సాధారణంగా కొత్త నటీనటులు కావాలని ఎవరైనా ఆడిషన్స్ నిర్వహిస్తే చాలా మందికి ఆఫీస్ ల ముందు వాలిపోతారు. ఇక రాజమౌళి అదే తరహాలో చేస్తే జనాలు ఏ రేంజ్ లో వస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చాలా వరకు ప్రముఖ తారలే రాజమౌళి సినిమాలో నటించాలని ఆయన ఆఫీస్ ముందు ఉంటారు. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం జక్కన్న #RRR స్క్రిప్ట్స్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం నూతన నటీనటులను ఎంపిక చేసుకుంటే బావుంటుందని రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. అందుకే ఫ్రెష్ ఫెసెస్ కోసం ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కొత్త నటీనటులు అంతగా కనిపించరు. కుదిరితే సీరియల్ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఈ సారి మల్టి స్టారర్ కోసం ఆయన చేస్తున్న ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Comments
Post a Comment